అల్గునూరు యాక్సిడెంట్‌లో కొత్త ట్విస్ట్‌!

కరీంనగర్‌ :  అల్గునూర్‌ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి అయిన ఘటనలో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. అది ప్రమాదం కాదని, ఆత్మహత్య అని భావిస్తున్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చేలా ఓ ఆధారం లభించింది. ఈ కారు ప్రమాదంపై పోలీసులు మొదటినుంచి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి ఫెర్టిలైజర్‌ షాపులో దొరికన డైరీ వారి అనుమానాలకు ఊతమిస్తోంది. ఆ డైరీలో యాక్సిడెంట్‌కు ముందే తన ఆస్తి అంతా టీటీడీకి అప్పగించాలని సత్యనారాయణ రాసుకున్నారు. దీంతో ఇది ఖచ్చితంగా ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. ’( జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా! )