మరోసారి తెరపైకి ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు

 హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య- నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయం చేయాలంటూ దిశ నిందితుల కుటుంబ సభ్యులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దిశ నిందితులది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని.. అందులో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యూడిషియల్‌ కమిషన్‌ను కలిసేందుకు వారు హైకోర్టుకు చేరుకున్నారు. పరిహారంపై కమిషన్‌ ముందు ప్రస్తావించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గురువారం కమిషన్‌ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జ్యూడిషియల్‌ కమిషన్‌కు నిందితుల కుటుంబ సభ్యులు అఫిడవిట్‌ దాఖలు చేశారు.(దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో నేరం జరిగిందా?)