జార్ఖండ్‌ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రారంభం

రాంచి: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 16 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌లో దాదాపు 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బోరియో, బార్హెట్‌, లితిపరా, మహేష్‌పూర్‌, సికారిపరా తదితర నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. మిగతా స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.




ఇక జార్ఖండ్‌ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సొరేన్‌ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా డుమ్కా, బార్హెట్‌ నియోజకవర్గాల్లో బరిలో దిగిన ఆయన.. నేడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖుల భవిష్యత్‌ సైతం ఓటర్లు నేడు నిర్ధారించనున్నారు. కాగా జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు.(వారు పెళ్లి చేసుకోరు..కానీ మహిళలపై లైంగిక దాడులు!)